వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్తం

Join Our telegram Channel

మగ్గాలమీద ఆధారపడి నేతనేస్తున్న చేనేత కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్తం పధకంను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి గారు ది. 21.12.2019 నాడు ప్రారంభించారు. ఈ పధకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24,000/-ల ఆర్థిక సహాయం చేస్తారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 81,783 చేనేత కుటుంబాలు వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్తం పధకం క్రింద లబ్దిపొందారు.

Join Our telegram Channel

1. డిసెంబర్‌ 21 తర్వాత పధకానికి అర్హులైన లబ్దిదారులు ఇంకా మిగిలి ఉన్నారని వారికి కూడా వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్తం పధకంలో చేర్చుకోవాలన్న అభ్యర్థనలను మన్నించి కొత్త దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటివరకు 43,795 కొత్త దరఖాస్తులు చేనేత మరియు జౌళి శాఖకు వచ్చాయి.

2. గతంలో లబ్దిపొందిన చేనేత కుటుంబాల జాబితాను మరియు కొత్తగా వచ్చిన దరఖాస్తులను
క్షేత్రస్థాయిలో అభ్యర్థనలు పరిశీలించి తుదిజాబితాను నిమిత్తం గ్రామ/వార్డు వాలంటీర్లు &
గ్రామ/వార్డు సచివాలయ శాఖకు చేనేత & జౌళి శాఖ వారు ది. 18.05.2020 నాటికి పంపబడును.

3. గ్రామ/వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి, ది.21.12.2020 నాడు లబ్దిపొందిన చేనేత
కుటుంబాల జాబితాను గ్రామ/వార్డు సచివాలయంలో సామాజిక తనిఖీ నిమిత్తం 19 మే 2020 నుండి 28 మే 2020 వరకు ప్రదర్శించవలెను.

4. వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్తం పధకానికి కొత్తగా వచ్చిన దరఖాస్తులను నవశకం వెబ్సైటు నందు అప్లోడ్‌ చేయడమైనది.

5. గ్రామ/వార్డు సంక్షేమ. & అభివృద్ధి కార్యదర్శి సంబంధిత సచివాలయ పరిధిలో వచ్చిన దరఖాస్తులను డౌన్‌-లోడ్‌ చేసి వాటిని ప్రింట్‌ తీయవలెను. (ఇప్పటికే చేనేత మరియు జౌళి శాఖ
వారు దరఖాస్తులను సచివాలయాలకు పంపినట్టైతే మరలా ప్రింట్‌ తీయాల్సిన అవసరం లేదు).

6. దరఖాస్తులను సంబంధిత గ్రామ/వార్డు వాలంటీర్లకు ఇచ్చి క్షేత్రస్థాయిలో ఈ క్రింద తెలిపిన అర్హత నిబంధనలను అనుసరించి పరిశీలించవలసిందిగా తెలియచేయవలెను.

(i) స్వంత మగ్గం కలిగియుండి దానిపై పనిచేయుచూ జీవనోపాధి పొందుచున్న చేనేత కార్మికులు మాత్రమే ఈ పధకానికి అర్హులు.

(ii) కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గంలు ఉన్నప్పటికీ ఒక చేనేత మగ్గమునకు మాత్రమే ఆర్థిక సహాయం అందించబడుతుంది.

(iii) దారిద్ర రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులు మాత్రమే ఆర్థిక సహాయమునకు అర్హులు.

(iv) ప్రాధమిక చేనేత సంఘముల మరియు మాస్టర్‌ వీవర్ల షెడ్ లలో పనిచేయుచున్న చేనేత కార్మికులు వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్తం పధకంకు అనర్హులు.

(v) చేనేత అనుబంధ వృత్తులలో పనిచేయు కార్మికులు ఈపధకం ద్వారా సహాయం పొందుటకు అనర్హులు (ఉదా. నూలు వడుకువారు, పడుగు తయారుచేయువారు, అద్దకం పనివారు, అచ్చులు అతికేవారు మొదలైనవారు అనర్హులు)

(vi) చేనేత కార్మికులు ఎవరైతే మగ్గంను కొత్తగా పర్పాటుచేసుకున్నారో, వారు అప్పటినుండి సంవత్సరం పాటు పూర్తిగా మగ్గంపై పనిచేసినచో ఈ పధకంకు అర్హులగుదురు.

7. దరఖాస్తులు తీసుకుని పై అర్హతలను పరీక్షించి అర్హతగల చేనేత కుటుంబాలను నిర్ధారించుటకు గ్రామ/వార్డు వాలంటీర్లు క్షేత్ర సందర్శన చేయవలెను.

8. క్షేత్ర సందర్శన పూర్తయిన పిమ్మట అర్హత కలిగిన చేనేత కుటుంబాల జాబితాను సచివాలయంలో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శికి అప్పగించవలెను.

9. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసుకున్న తర్వాత అర్హత పొందిన లబ్దిదారుల జాబితాను ది.22.05.2020 నుండి 28.05.2020 వరకు గ్రామ/వార్డు సచివాలయంలో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించవలెను.

Join Our telegram Channel

10. 29.05.2020 నాటికి కొత్త దరఖాస్తులలోని లబ్దిదారులు మరియు గతంలో లజ్దిపొందిన లబ్దిదారులపై వచ్చిన అభ్యంతరాలను పూర్తిచేసి తుది జాబితాను సిద్ధంచేయాలి.

11. తుది జాబితాను మండలాలలో MPDO మరియు మునిసిపాలిటిలలో మునిసిపల్‌ కమీషనర్‌ కు 30.05.2020 లోపు సమర్పించవలెను.

12. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లు అర్హతకలిగిన ప్రతి చేనేత కుటుంబం లబ్దిదారుల జాబితాలోకి రావాలి. అనర్హులు ఎవ్వరూ జాబితాలోకి రాకూడదు. కాబట్టి బాధ్యతగా శ్రద్ధగా పనిచేసి పేద ప్రజలకు సేవచేద్దాం...


వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సినవి:-

1. స్వంత మగ్గం కలిగి ఉన్నారా? లేదా?
2. ఒక కుటుంబంలో ఒక మగ్గంకు మాత్రమే అర్హత కలిగి ఉంటారు
3. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబమా? కాదా?
4. కొత్త మగ్గం ఉన్న వారు సంవత్సరకాలం పూర్తిచేసుకున్నారా? లేదా?


Join Our telegram Channel

Post a Comment

Previous Post Next Post