“జగనన్న చేదోడు - టైలర్లు ” - సర్వే చేసిన లబ్దిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ లేదా గ్రామ/వార్డు సభల ద్వారా పునఃపరిశీలన చేసి సరిచేయుటకు మార్గదర్శకాలు



Join Our telegram Channel


జీవన రధం ముందుకు నడవడానికి నిరంతరం కుట్టు-మిషన్‌ చక్రం తిప్పుతూ టైలరింగ్‌ ను వృత్తిగా స్వీకరించిన, షాపులున్న టైలర్లు వారి యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకొనుటకు మరియు దైనందిన వృత్తిజీవితంలో అవసరమైన పెట్టుబడులకు కావలసిన నగదును అధికవడ్డీలకు బయటి వ్యక్తులు లేదా సంస్థలపై ఆధారపడకుండా ఆర్థికంగా నిలదొక్కుకొనుటకు సంవత్సరానికి రూ.10,000/-ల చొప్పున 5 సంవత్సరాలపాటు ఆర్థిక సహాయం చేయుటకు “జగనన్న చేదోడు” పధకానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.యెస్. జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికారు


జగనన్న చేదోడు పధకంలో భాగంగా అర్హత కలిగి షాపులున్న టైలర్లు నుండి దరఖాస్తులను ది.31.01.2020 నుండి ఆహ్వానించడమైనది.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ/వార్డు వాలంటీర్లు జగనన్న చేదోడు పధకాన్ని అర్హులైన టైలర్లు అందరికీ అవగాహన కల్పించి వారిని దరఖాస్తు చేసుకొనుటలో కీలకపాత్ర పోషించారు.

టైలర్ల నుండి వచ్చిన దరఖాస్తులను BC కార్పొరేషన్‌ వారి సూచనల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన చేసి జాబితాను సదరు శాఖకు సమర్పించడమైనది.

టైలర్ల నుండి వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికానిచోట తక్షణమే అంటే మే 16వ తేదీలోపు గ్రామ/వార్డు వాలంటీర్లు దరఖాస్తులను మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి సదరు సమాచారాన్ని MPDOలు మరియు మునిసిపల్‌ కమీషనర్ల ద్వారా కార్యనిర్వాహక సంచాలకులు BC కార్పొరేషన్‌ వారికి పంపవలెను. దరఖాస్తులను పునఃపరిశీలన చేయుటకు ఈ క్రింది అర్హత నియమాలను జారీచేయడమైనది.


అర్హత నియమాలు:-

1. 21 సంవత్సరాలు నిండిన వారు

2. నెలవారీ ఆదాయం గ్రామాలలో రూ.10,000/- మరియు పట్టణాలలో రూ.12,000/- కలిగిన వారు

3.  ప్రభుత్వం జారీచేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (S.C., S.T., B.C., Minority, E.B.C.)

4. ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డులను (అధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు, లేదా ఇతరములు) కలిగినవారు.

5. బ్యాంకులో స్వంత ఖాతా కలిగినవారైయుండవలెను.

6. షాపులున్న టైలర్లు అనగా అన్ని కులములకు చెందినవారు  (S.C., S.T., B.C., Minority, E.B.C.) టైలరింగ్‌ వృత్తి పైనే అనగా ప్రధానమైన వృత్తిగా స్వీకరించి దానిపై పూర్తిగా ఆధారపడి జీవనోపాధి చేయుచున్న వారు మాత్రమే అర్హులు.

7. కేవలం కుట్టు పని నేర్చుకొని కుటుంబములోని స్వంత బట్టలు మొదలైనవి కుట్టుకుంటూ, ఇతర వృత్తులపై జీవనోపాధి చేయుచున్న వారు అనర్హులు.

8. ఈ పథకము క్రింద లబ్ది పొందు ఉద్ద్యేశ్యముతో కొంతమంది అభ్యర్థులు తాత్కాలికమైన ఏర్పాటు అనగా బానర్లు, ప్లేక్సీలు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని వారి కుటుంబ అవసరాల నిమిత్తం వారి వద్ద ఉన్నటువంటి కుట్టు మిషన్‌ ను షాపుగా చూపించి సదరు ఫోటోలను అప్‌-లోడ్‌ చేయించి లబ్దిదారుల జాబితాలో వారి పేర్లను చేర్చియున్నారు. కాని వారి ప్రధాన వృత్తి టైలరింగ్‌ కాకుండా ఇతర వ్యాపారాలు/వృత్తులపై ఆధారపడ్డ వారిని అనర్హులుగా పరిగణించి వారి పేర్లను సర్వే జాబితా నుండి తొలగించవలెను.



Join Our telegram Channel

అనర్హులు

1. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి ఉద్యోగ విరమణ పెన్షన్‌ పొందు వారు మరియు ఆదాయపు పన్ను చెల్లించు వారు అనర్హులు.

2. కేవలం ప్రభుత్వము నుండి “జగనన్న చేదోడు” పథకము ద్వారా మంజూరు చేయు ఆర్థిక సహాయము కొరకు మాత్రమే తాత్కాలికమైన షాపులు చూపించి, వారు వేరొక ప్రధాన వృత్తిలో కొనసాగుచున్న వ్యక్తులు అనర్హులు.

3. కుటుంబములో ఎవరికైన మాగాణి భూమి 3 ఎకరములు పై బడి మరియు మెట్ట భూమి 10 ఎకరములకు పై బడి మరియు మాగాణి, మెట్ట భూమి వెరసి 10 ఎకరములకు పై బడి ఉన్న వారు ఈ పథకమునకు అనర్హులు. దీనిని నిర్దారించుటకై స్థానికముగా విచారణ చేయుటతో పాటు మీ భూమి పోర్టల్‌ ద్వారా కూడా తెలుసుకొనగలరు.

4. కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్‌ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో,టాక్సీ మరియు ట్రాక్టర్‌ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.

5. పట్టణ ప్రాంతములోని కుటుంబ సభ్యులలో ఎవరికైన 1000 చదరపు అడుగులకు పైబడి సొంత నివాస గృహము ఉన్న వారు అనర్హులు.

6. వాలంటీర్లు దరఖాస్తు చేసిన లబ్బిదారుని ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా వారితో మాట్లాడి కులధృవీకరణ, గుర్తింపు కార్టులను పరిశీలించవలెను సదరు పత్రాల నకలును నవశకం పోర్టల్‌ లో అప్లోడ్‌ చేయవలెను.

7. AP వాలంటీర్‌ యాప్‌ ద్వారా 2019-20 సంవత్సరంలోని లబ్దిదారులను మరియు క్రొత్తగా అర్హతపొందిన టైలర్లను, షాపును మరియు సంబంధిత గ్రామ/వార్డు వాలంటీర్‌ ను కలిపి స్పష్టంగా ఫోటో తీసి దానిని యాప్‌ లో అప్లోడ్‌ చేయవలెను.

8. వాలంటీర్లు లబ్దిదారుని ఎంపికను ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయితీగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రజలందరికి సేవలు అందేలా చూడాలి



Join Our telegram Channel


Post a Comment

Previous Post Next Post