పెన్షన్:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  వయో వృద్ధులకు, వికలాంగులకు, కొన్ని చేతి వృత్తుల వారికి, దారిద్య రేఖ కు దిగువలో ఉన్న వారికి చేసే ఆర్ధిక సహాయమును పెన్షన్ అని అంటారు.


1. పెన్షనర్ తప్పనిసరిగా పేదరికానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండాలి
2. అతను/ఆమె ఏ జిల్లాలో అయితే పెన్షన్ కి పెట్టుకుంటున్నారో ఆ జిల్లాకి చెందిన వ్యక్తి అయ్యి ఉండాలి.
3. అతను/ఆమె కి మరి ఏ ఇతర పెన్షన్ లబ్ధిదారులు అవరాదు.
4. నాలుగు చక్ర వాహనం ఉండరాదు.
5. కరెంటు బిల్లు 6 నెలల సరాసరి 300 యూనిట్లు లోపు ఉండాలి.
6. కుటుంబంలో ఎవరు ఆదాయపు పన్ను చెల్లించరాదు.
7. ఒక కుటుంబంలో ఒక పెన్షన్ మాత్రమే ఇచ్చును (మినహాయయింపు అంగవైకల్యం 80%).
8. ఆదాయం పట్టణ ప్రాంతంలో 12000/- మించరాదు  గ్రామీణ ప్రాంతంలో 10000/- మించరాదు.

కొత్త పెన్షన్ అప్లై చేయుటకు కావాల్సిన సర్టిఫికెట్స్ :-

1 . పెన్షన్ ఫారం

2. ఆధార్ కార్డు నకలు


అప్లికేషను ఫారం డౌన్లోడ్ చేసుకోండి.





పెన్షన్ రకం (కావాల్సిన సర్టిఫికెట్స్):-

వృద్ధాప్య పెన్షన్:-

వయస్సు (వయో పరిమితి) ప్రూఫ్.

వృద్ధాప్య పెన్షన్ కి అప్లై చేసే వారి వయస్సు తప్పనిసరిగా 60 సం. రాలు నిండి ఉండాలి.(ఆధార్ కార్డ్ లో మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా 60 సం. రాలు నిండి ఉండాలి)

ఒంటరి మహిళా పెన్షన్':-

ఒంటరి మహిళా సర్టిఫికేట్.

ఒంటరి మహిళ కి గ్రామీణ ప్రాంతాల్లో వారికి 30 సం.రాలు నిండి ఉండాలి. పట్టణ ప్రాంతంలోని వారికి 35 సం. రాలు నిండి ఉండాలి . మరియు ఒంటరి మహిళ అని తహసిల్దార్ గారి నుంచి పత్రం తీసుకురావలెను.

వితంతు పెన్షన్;:- 

మరణ ధృవీకరణ పత్రము.

వితంతు పెన్షన్ కి అప్లై చేసే మహిళ కి మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 18 సం. రాలు నిండి ఉండాలి.

వికలాంగుల పెన్షన్:-

సదరం సర్టిఫికేట్ వుండాలి (40 % దాటి వుండాలి)


ట్రాన్స్ జెండర్ పెన్షన్:-

మెడికల్ సర్టిఫికేట్

ట్రాన్స్ జెండర్ పెన్షనర్ కి 18 సం. రాలు నిండి ఉండాలి . మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి.


weavers/ Toddy Toppers/ Fisher Man

Society Issued Cerificate

కల్లు గీత కార్మికులు వయసు 50 సం.రాలు లేదా 50 పైబడి ఉండాలి . వారి సంఘం నుంచి సర్టిఫికెట్ తప్పినిసరిగా ఉండాలి.

మత్స్య కారుల పెన్షన్ కి వయస్సు 50 సం.రాలు నిండి ఉండాలి సంఘం సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

నేత కార్మికుల పెన్షన్ కి వయస్సు 50 సం. రాలు నిండి ఉండాలి.

చెప్పులు కుట్టు వారికి 40 సం. రాలు నిండి ఉండాలి. మరియు సంఘం యొక్క సర్టిఫికెట్ తప్పనిసరి.

CKDU PENSIONS:

వయోపరిమితి లేదు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, etc  దీని కిందకు వస్తారు. వీరికి ప్రతి నెల 10000 రూపాయలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది.


కొత్త పెన్షన్ అప్లై చేయు విధానం కొరకు ఈ క్రింది వీడియో ని చుడండి'.






Host & Article by 

Sandhya lakshmi 
Manikonda 1 PSDA, Ungutur Mandal, Krishna Dist

6 Comments

  1. Nice information babout pension.how to convert d.m.h.o pension from o.a.p

    ReplyDelete
  2. AND ALSO PLEASE TELL TO PSS PROBLEM LIKE HOW TO DO PSS
    WHERE TO DO AND WHEN NEED TO DO
    WHO CAN DO PSS VRO OR OTHER OFFICER Because we are facing so many problems with people

    ReplyDelete
  3. Sadaram certification mida video chey bro.. . With some subject matters

    ReplyDelete
  4. Tq so much for this useful information

    ReplyDelete
  5. bro pension application unte gsws nuzvid team lo pettu , pareesilana pension kaadu

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post