ఇంటిగ్రేట్ సర్టిఫికెట్ :- ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ని సాధారణంగా కుల ధ్రువీకరణ పత్రం కోసమే ఉపయోగిస్తారు
ఇంటిగ్రేట్ సర్టిఫికెట్ 3 వివరాలను తెలియజేస్తుంది:-
1. వ్యక్తి యొక్క కులము (cast)
2. వ్యక్తి యొక్క జనన వివరములు (DOB)
3. వ్యక్తి యొక్క చిరునామా (Resident)
ఇంటిగ్రేట్ సర్టిఫికెట్ కొరకు కావాల్సిన సర్టిఫికేట్లు :-
1.అప్లికేషన్ ఫారం (Download Form)
2. ఆధార్ నకలు
3. నోటరీ (ఎటువంటి ప్రూఫ్ లు లేకపోతే )
4. అఫిడవిట్
5. కుల ధ్రువీకరణ వివరములు కొరకు నకలు ఈ క్రింది వాటిలో ఏదయినా ఒకటి సరిపోతుంది.
i. TC (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్)
ii. ఇంతకు ముందు అతను లేదా ఆమె అప్లై చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ నకలు .
iii. వారి కుటుంబంలోని వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ నకలు
iv. కుల సంఘాలు (Recognized Communities) నుండి పొందిన ధ్రువీకరణ పత్రం.
v. గ్రామములో శాశ్వతముగా నివసించే వారి (గ్రామ పెద్దలు) నుండి పొందిన పంచనామా(షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు).
Post a Comment