ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి సచివాలయ ఉద్యోగి మరియు వాలంటీర్ లు అందరు  covid -19 andhra pradesh app ముందుగా install చేసుకుని దాని గురించి అవగాహన కలిగించుకుని  మీ సచివాలయ పరిధిలోని స్మార్ట్ మొబైల్ వున్న ప్రతి ఒక్కరి మొబైల్ ఇన్స్టాల్ చేయించి వారికి ఆ app గురించి పూర్తిగా వివరించాలి.

5 వ విడత ఇంటింటి ఫీవర్ సర్వేలో  భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ దిగువ సూచనలు జారీ చేయటం జరిగింది.  గత సర్వేలో కొన్ని పొరపాట్లు తప్పిదాలు గమనించటం జరిగింది, అవే మరలా తిరిగి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సర్వే నిర్వహించాలని కోరుచున్నాము. 

👍చేయవలసినవి:

👉  సర్వే సమయానికి ముందురోజు ఫీవర్  సర్వే గురించి ప్రజలందరికీ తెలిసేలా టాం -టాం వేయించాలి 
👉 ప్రజలు అందుబాటులో ఉండే సమయాలలో మాత్రేమే సర్వే నిర్వహించాలి 
👉 సర్వే కార్యక్రమాన్ని స్వయంగా ఆయా ప్రాంత ఆశా కార్యకర్త, ANM మాత్రమే నిర్వహించాలి. 
👉 వాలంటీర్ సర్వేలో పాల్గొని తమ మొబైల్ ఆప్ ద్వారా ఆశా/ ANM స్వయంగా చెప్పిన వివరాలు నమోదు చేయాలి
👉కోవిడ్ లక్షణాలు ఉన్నవారు/ ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారిని 100% గమనించాలి
👉ఈ సర్వేలో మలేరియా, డెంగీ గురించి పూర్తి అవగాహన మరియు నివారణ చర్యలు తీసుకోవాలి
👉ప్రతి ఇంటా " Covid19 Andhrapradesh" మొబైల్ ఆప్ ని స్వయంగా ఇంస్టాల్ చేయించాలి. 

👎చేయకూడనివి: 

👉మాస్క్, తగిన ఇతర రక్షణ చర్యలు లేకుండా సర్వే చేయరాదు.
👉ఆఫీసులో, మీ ఇంట్లో లేక ఒకేచోట ఉంటూ సర్వే వివరాలు నమోదు చేయరాదు. 
👉మీరు వెళ్లిన ఇంటికి తాళం వేసిఉన్నపుడు నిర్లక్ష్యం తో వదిలివేయవద్దు 
👉ఈ సర్వే కోసం ఎటువంటి ఫార్మ్స్ వాడవద్దు, స్వయంగా మొబైల్ ఆప్ ద్వారా ప్రజల ఇంటివద్ద చేయాలి. 
👉ప్రజల పట్ల ఏ పరిస్తితి లోను అసహనం చూపించవద్దు 

ధన్యవాదాలు
వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


Covid 19 Andhra Pradesh app యాప్ ఫీచర్స్ మరియు వివరముల కొరకు ఈ క్రింది వీడియో ని చుడండి.



యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి'.


1 Comments

Post a Comment

Previous Post Next Post