Ysr pension kaanuka :


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వై ఎస్ ఆర్ పెన్షన్ కానుక మొబైల్ వెర్షన్ 1.5 రిలీజ్ చేయబడింది.
ఇందులో ఈ క్రింది అంశాలు ఇవ్వబడినవి.

ఈ వెర్షన్ ని మీకు AP ONLINE DC నుండి కానీ MC నుండి కానీ చేరవేయడం జరుగుతుంది.ఈ వెర్షన్ డౌన్లోడ్ చేయడం లో సమస్య ఉన్నా,పంపిణీ సమయంలో సమస్య ఉన్నా,పెన్షనర్ డీటెయిల్స్ అప్డేట్ లో సమస్య ఉన్నా AP ONLINE MANDAL CO ORDINATOR ని సంప్రదించవలెను.అలాగే MC కి inform చేయకుండా యాప్ ని uninstall చేయరాదు.

1.PAYMENT: ఇందులో పెన్షనర్ యొక్క ఫోటో కాప్చర్ చేసి వాలంటీర్/వెల్ఫేర్ యొక్క ఆతేంటికేషన్ ద్వారా పేమెంట్ చేయవలెను.

       పోర్టబుల్ పేమెంట్ :ఇందులో వేరే సచివాలయాలకి సంబందించిన పెన్షనర్స్ కి పేమెంట్ చేయవలెను.ఈ సదుపాయం వెల్ఫేర్ అసిస్టెంట్ కి మాత్రం ఇవ్వబడింది.



2. REPORTS: వాలంటీర్ లాగిన్ రిపోర్ట్స్ నందు వాలంటీర్ కి మాప్ అయిన మొత్తం పెన్షన్స్ మరియు నగదు,పంపిణీ చేసిన పెన్షన్స్ మరియు నగదు,పంపిణీ చేయవలసిన పెన్షన్స్ మరియు నగదు వివరాలు ఉంటాయి.అలాగే వెల్ఫేర్ లాగిన్ రిపోర్ట్స్ నందు పైన తెలిపిన వివరాలతో పాటు పోర్టబిలిటీ ద్వారా పంపిణీ చేసిన పెన్షన్స్ మరియు నగదు,మొత్తం వాలంటీర్స్ సంఖ్య మరియు పేరు,ఆతేంటికేషన్ ద్వారా పంపిణీ చేసిన వివరాలు,సెల్ఫ్ ఆతేంటికేషన్ ద్వారా పంపిణీ చేసిన వివరాలు,వాలంటీర్ ద్వారా పంపిణీ చేసిన వివరాలు,వెల్ఫేర్ ద్వారా పంపిణీ చేసిన వివరాలు,మాపింగ్ కానీ పెన్షన్ దారుల వివరాలు ఉంటాయి.

3. Pensioner info update :ఇందులో రెండు ఆప్షన్స్ ఇవ్వబడినవి.అందులో

A. unpaid remarks:ఇందులో పంపిణీ కానీ పెన్షనర్స్ యొక్క వివరాలు కారణాలతో అప్డేట్ చేయాలి.ఆ కారణాలు

a. లాక్డౌన్ కారణంగా పెన్షనర్ వేరే ప్రాంతం కానీ,రాష్ట్రం లో కానీ ఉండిపోయారు.

b.పెన్షనర్ వేరే ప్రాంతం లోకి వలస వెళ్లారు కానీ పోర్టబిలిటీ అవకాశం వినియోగించుకోలేదు.

c.పెన్షనర్ వేరే ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లారు.

d.చనిపోయారు

e.డోర్ లాక్

f.ఈ సెక్రటేరియట్ కి సంబందించిన వారు కాదు.

g.రాష్ట్రం బయట ఉన్నారు

h. జిల్లా బయట ఉన్నారు.

i.హాస్పిటల్ లో ఉన్నారు.

j. పెన్షన్ కి అనర్హులు.

      B.Transfer/migration/portability:  ఈ ఆప్షన్ నందు పెన్షనర్ వివరాలను వేరే ప్రాంతానికి బదిలీ,మైగ్రేషన్ మరియు పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ తీసుకోవాలి అనే పెన్షనర్ వివరాలను నమోదు చేయాలి.

4.Notifications :ఇందులో ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు పొందుపరచడం జరుగుతుంది.

5.user info update: ఇందులో volunteer status మరియు withdrawl status అని రెండు ఉంటాయి.

వాలంటీర్ స్టేటస్ లో వాలంటీర్ యొక్క present status అనగా  leave, resign, not attend duties అలా వాలంటీర్ స్టేటస్ లో update చేయాలి.

WIthdrawl status లో ఎంత అమౌంట్ draw చేశారు .. ఎంత డిస్బర్సుమెంట్ చేశారు ఎంత remittance అమౌంట్ కట్టాలి అనే ఆప్షన్స్ ఉంటాయి.

6.Acquittance:ఇందులో ఏ సచివాలయం కి సంబందించిన పెన్షనర్స్ యొక్క acquittance డౌన్లోడ్ చేసుకొనవచ్చు.


7.పెన్షన్స్ క్లోసింగ్ ఆప్షన్ ఇవ్వబడింది.ఇది లాగిన్ అయిన తర్వాత మనకు"click here to close the payments "అనే ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేయగానే please update the unpaid pensioners data అనే మెసేజ్ వస్తుంది.అంటే మీరు పంపిణీ చేయని పెన్షనర్స్ యొక్క remarks అప్డేట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది.

8. అలాగే చివరన తెలుగులో"పెన్షన్ పంపిణీ సమయం లో పెన్షనర్ యొక్క ఫోటో మాత్రమే తీయవలెను.లేనిచో పెన్షన్ పంపిణీ అధికారి బాధ్యత వహించాలి"అనే స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది.


9.పెన్షన్ పంపిణీ పూర్తి అయిన వెంటనే పెన్షనర్స్ యొక్క ఫోటోస్ ప్రతిఒక్క వాలంటీర్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ అప్లోడ్ చేయాలి.



Post a Comment

Previous Post Next Post